Share News

ఓటమి దిశగా హైదరాబాద్‌

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:18 AM

ముంబైతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. ముంబై తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 560 పరుగులకు జవాబుగా....

ఓటమి దిశగా హైదరాబాద్‌

హైదరాబాద్‌: ముంబైతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. ముంబై తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 560 పరుగులకు జవాబుగా..ఓవర్‌నైట్‌ స్కోరు 138/2తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 267 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో ఫాలోఆన్‌లో పడిన హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆఖరికి 166/7 స్కోరుతో కష్టాల్లో పడింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 127 రన్స్‌ దూరంలో ఉన్న హైదరాబాద్‌కు చేతిలో 3 వికెట్లే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

Updated Date - Jan 25 , 2026 | 05:19 AM