Share News

అఫ్గాన్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్

ABN , Publish Date - Sep 15 , 2026 | 07:13 PM

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

అఫ్గాన్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్
India vs Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి టీ20లో గాయపడ్డ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లోనూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు.


భారత తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, రవి బిష్ణోయ్

అఫ్గానిస్థాన్ తుది జట్టు:

ఇబ్రహిం జద్రాన్(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నయిబ్, డార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబుర్ రెహ్మాన్, ఫారుఖీ


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించిన శ్రీచరణి.. తొలి భారత బౌలర్‌గా..

అది సర్వసాధారణం.. నఖ్వీతో ఫ్రెండ్లీ చాట్‌పై సైకియా రియాక్షన్

Updated Date - Sep 15 , 2026 | 07:13 PM