Share News

అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Sep 15 , 2026 | 09:10 PM

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?
India vs Afghanistan

ఇంటర్నెట్ డెస్క్: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ ఇబ్రహిం జద్రాన్(37) టాప్ స్కోరర్.


డార్విష్ రసూలీ(26), రషీద్ ఖాన్(28), మహ్మద్ నబి(20) పరుగులు చేశారు. ఓపెనర్ గుర్బాజ్(0), సెదిఖుల్లా అటల్(12), గుల్బాదిన్(10), అజ్మతుల్లా ఒమర్జాయ్(11) విఫలమయ్యారు. నూర్ అహ్మద్(7*), ముజీబుర్ రెహ్మాన్(4*) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 3, అర్ష్‌దీప్ సింగ్ 2, అక్షర్ పటేల్, బుమ్రా, రవి బిష్ణోయ్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్

వెస్టిండీస్‌తో సిరీస్.. వన్డే జట్టులో పంత్, హార్దిక్ పాండ్యలకు చోటు?

Updated Date - Sep 15 , 2026 | 09:10 PM