భారత కెప్టెన్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పాలస్తీనా ఆటగాడు..
ABN , Publish Date - Nov 18 , 2026 | 10:01 AM
ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శనతో పాలస్తీనాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. భారీ వర్షం, ప్రతికూల మైదాన పరిస్థితులను అధిగమించి భారత్ విక్టరీ సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శనతో పాలస్తీనాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. భారీ వర్షం, ప్రతికూల మైదాన పరిస్థితులను అధిగమించి యువ భారత్ విక్టరీ సాధించింది. అయితే గ్రూప్-ఈ లో జరిగిన మ్యాచ్‌లో ఫుట్‌బాల్ కంటే పాలస్తీన ఆటగాళ్ల ఓవరాక్షన్ చర్చనీయాంశంగా మారింది. భారత కెప్టెన్‌పై పాలస్తీనా ఆటగాడు అభ్యంతరకర సంజ్ఞ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో ఆటగాడు ప్రమాదకర టాకిల్‌కు పాల్పడి.. రెడ్ కార్డు అందుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ సందర్భంగా పాలస్తీనా ఆటగాడు భారత కెప్టెన్ గాంగ్టేను ఉద్దేశించి అభ్యంతరకరమైన సంజ్ఞ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఖేల్ ఇండియా ఎక్స్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాలస్తీన ప్లేయర్లు అనుచితంగా ప్రవర్తించిన రిఫరీ పట్టించుకోలేదని, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే పాలస్తీనా ఆటగాడు చేసిన సంజ్ఞ జాతి వివక్షతో కూడుకున్నదా అనే విషయంపై అధికారిక నిర్ధారణ లేదు. దీనిపై ఏఎఫ్‌సీ నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మ్యాచ్‌లో మరో ఘటన వివాదానికి దారితీసింది. భారత ఆటగాడిపై పాలస్తీనా ఫుట్‌బాలర్ ప్రమాదకరంగా టాకిల్ చేయడంతో పాటు, అతడి చేతిపై తొక్కి, తన్నినట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో సదరు పాలస్తీనా ప్లేయర్‌కు రిఫరీ రెడ్ కార్డు చూపించాడు. మొత్తంగా పాలస్తీనాపై విజయంతో గ్రూప్-ఈలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి:
శుద్ధినీటిపై ఆసక్తి.. క్యూరింగ్‌తో పాటు పలు అవసరాలకు..
‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..