Share News

ఐదో వన్డేలో కివీస్‌పై విజయం.. సిరీస్ టీమిండియాదే

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:24 PM

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో కివీస్‌పై 22 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. 187 పరుగులకే ఆలౌటైంది.

ఐదో వన్డేలో కివీస్‌పై విజయం.. సిరీస్ టీమిండియాదే
India vs New Zealand

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో కివీస్‌పై 22 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. 187 పరుగులకే ఆలౌటైంది. తొలి రెండు మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా.. మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. కాగా నాలుగో వన్డేలో న్యూజిలాండ్ గెలిచింది. దీంతో సిరీస్ 3-1 తేడాతో భారత్ వశమైంది.


ఐదో వన్డేలో 210 లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఫాక్స్‌క్రాఫ్ట్(31) టాప్ స్కోరర్. నిక్ కెల్లీ(24), మిచెల్ శాంట్నర్(24), విల్ యంగ్(22), బ్రేస్‌వెల్(19), క్లార్క్(16) పరుగులు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంతో భారత బౌలర్లు సఫలమయ్యారు. అర్ష్‌దీప్ సింగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు, నబీ, యశ్ ఠాకూర్, నమన్ ధీర్ తలొక వికెట్ చొప్పున పడగొట్టారు.


అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 209 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ(7), విరాట్ కోహ్లీ(5) విఫలమయ్యారు. అక్షర్ పటేల్(46), ఇషాన్ కిషన్(46) రాణించారు. నమన్ ధీర్(22), శ్రేయస్ అయ్యర్(22) పర్వాలేదనపించారు. కివీస్ బౌలర్లలో డఫీ 3, శాంట్నర్ 3, ఫిషర్ 2, టిక్నర్, బ్రేస్‌వెల్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 15 , 2026 | 03:36 PM