Share News

విజయానికి వంద పరుగుల దూరంలో న్యూజిలాండ్.. పోరాడుతున్న టీమిండియా బౌలర్లు..

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:54 PM

భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో న్యూజిలాండ్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా నిర్దేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ నిలకడగా ఆడుతోంది.

విజయానికి వంద పరుగుల దూరంలో న్యూజిలాండ్.. పోరాడుతున్న టీమిండియా బౌలర్లు..
India vs New Zealand 5th ODI

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో న్యూజిలాండ్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా నిర్దేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ నిలకడగా ఆడుతోంది. తాజా సమాచారం ప్రకారం 29 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఇంకా 101 పరుగులు చేస్తే ఆ జట్టుకు విజయం దక్కుతుంది. దీంతో భారత బౌలర్లపై ఒత్తిడి పెరిగింది (India vs New Zealand 5th ODI).


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు చేయలేకపోయింది. 42.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) సమయోచితంగా రాణించడంతో భారత్ 200 పరుగుల మార్క్ దాటగలిగింది. రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) మరోసారి విఫలమయ్యారు. 210 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు భారత బౌలర్లు సవాలు విసురుతున్నారు. అయితే వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగుల వేగాన్ని పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు (IND vs NZ Live Score).


ఎదురుగా ఉన్న లక్ష్యం తక్కువగానే ఉండడంతో న్యూజిలాండ్ విజయం వైపు సాగుతోంది (India New Zealand Series 2026). ప్రస్తుతం డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 28 పరుగులతో, మైఖేల్ బ్రేస్‌వెల్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలవగా, మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. నాలుగో మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 15 , 2026 | 01:58 PM