విండీస్‌తో మూడో టీ20: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్లు!
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:38 PM
ఇండోర్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య మరికాసేపట్లో మూడో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన విండీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండోర్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య మరికాసేపట్లో మూడో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన విండీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లూ ఒక్కో గెలుపుతో 1-1 సమంగా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియాలో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. శివం దూబె స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, కుల్‌దీప్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు.
భారత్ తుది జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్
విండీస్ తుది జట్టు:
షై హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమిల్ పూరన్, షిమ్రోన్ హెట్‌మయర్, రోమన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ సాంప్సన్, కీమో పాల్, రోస్టన్ ఛేజ్, షర్మార్ స్ప్రింగర్, షమార్ జోసెఫ్, గుడకేశ్ మోతీ
ఇవి కూడా చదవండి:
యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ సలహాదారుగా స్మృతి మంధాన
టెస్టుల్లో కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్