IND Vs WI: అభిషేక్ శర్మ విధ్వంసం.. విండీస్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:51 PM
ఇండోర్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌కు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండోర్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌కు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(69; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్(37; 18 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌లు) రాణించాడు.
ప్రిన్స్ యాదవ్(13*; 6 బంతుల్లో 3 ఫోర్లు) ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తిలక్ వర్మ(28; 16 బంతుల్లో 4 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి(21; 14 బంతుల్లొ 3 ఫోర్లు), అక్షర్ పటేల్(20) పర్వాలేదనిపించారు. సంజు శాంసన్(3), శ్రేయస్ అయ్యర్(1), నమన్ ధీర్(10) విఫలమయ్యారు. అర్ష్‌దీప్ సింగ్(11) కాసేపు క్రీజులో నిలబడగలిగాడు. మయాంక్ యాదవ్(0) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో ఛేజ్ 2, షమర్ జోసెఫ్ 2, స్ప్రింగర్ 2, కీమో పాల్, మోతీ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
విండీస్‌తో మూడో టీ20: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్లు!
టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు