Share News

Chota Kohli: రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:04 PM

అచ్చం చిన్ననాటి కోహ్లీలా ఉన్న ఓ బాలుడు విరాట్‌ను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ అబ్బాయి తనతో విరాట్ ఏం మాట్లాడాడో.. సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రో-కో ఇద్దరూ తనను చోటా చీకూ అని పిలిచారని తెలిపాడు.

Chota Kohli: రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు:  విరాట్ పోలికలతో ఉన్న బాలుడు
Chota Kohli

ఇంటర్నెట్ డెస్క్: వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొంత మంది పిల్లలు ఆటగాళ్లను చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. అందులో అచ్చం చిన్ననాటి కోహ్లీలా ఉన్న ఓ చిన్నారి విరాట్‌ను కలిశాడు. విరాట్ కూడా ఆ బాలుడికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అతడు తనలా ఉన్న విషయాన్ని కోహ్లీ కూడా గుర్తించి.. ఆ విషయాన్ని రోహిత్‌తో కూడా పంచుకున్నాడు. రో-కో ఇద్దరూ ఆ బాలుడిని చోటా చీకూ అని పిలిచారు. రో-కోతో ఆ చిన్నారి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ అబ్బాయి తనతో విరాట్ ఏం మాట్లాడాడో.. సోషల్ మీడియా వేదికగానే పంచుకున్నాడు.


‘నేను కోహ్లీ(Virat Kohli )ని పేరు పెట్టి పిలిచా. నేను పిలిచిన తర్వాత.. కాసేపట్లో నీ దగ్గరకు వస్తాను అని నాతో అన్నాడు. తర్వాత రోహిత్ శర్మ(Rohit Sharma ) వైపు తిరిగి.. ‘నా డూప్లికేట్‌ను చూడు. అతడు అక్కడ కూర్చుని ఉన్నాడు’ అన్నాడు. అప్పుడు వారిద్దరూ నన్ను చోటా చీకూ అని పిలిచారు’ అని ఆ బాలుడు తన ముద్దుముద్దు మాటలతో ఆ రోజు జరిగిన సంఘటనను వీడియోలో వివరించాడు. ప్రస్తుతం అది కూడా వైరల్‌గా మారింది. అయితే ఆ బుడ్డోడి పేరు, ఊరు తదితర వివరాలేవీ వీడియోలో లేవు.


ఇవి కూడా చదవండి:

క్యాసినోలో క్రికెటర్లు.. ప్రదర్శన కంటే వివాదాలకే ప్రాధాన్యత!

విరాట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడినా.. ఫ్యాన్స్ బాధపడుతున్నారు: మహ్మద్ కైఫ్

Updated Date - Jan 13 , 2026 | 01:04 PM