సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కెప్టెన్.. గౌతమ్ గంభీర్
ABN , Publish Date - Feb 09 , 2026 | 04:33 PM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ఆటగాడిగా సూర్య తప్పులు చేయొచ్చు కానీ కెప్టెన్సీ పరంగా అన్ని విభాగాల్లో సమర్థుడని గంభీర్ పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ఆటగాడిగా సూర్య తప్పులు చేయొచ్చు కానీ కెప్టెన్సీ పరంగా అన్ని విభాగాల్లో సమర్థుడని గంభీర్ పేర్కొన్నాడు. ‘సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుతమైన కెప్టెన్. బ్యాటర్‌గా తనదైన షాట్లతో విధ్వంసం సృష్టించే సూర్య.. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు సారథిగా కూడా అదరగొడుతున్నాడు. సహచర ఆటగాళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. వారితో చక్కగా మాట్లాడతాడు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ తోటి ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నాడు. సూర్య జట్టు వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఉంచడటంతో కోచ్‌గా నా పని మరింత సులభతరం అవుతోంది. ఆటగాడిగా సూర్య కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు. కెప్టెన్‌గా మాత్రం అన్ని విభాగాల్లో సమర్థుడు. అలాంటి వ్యక్తి భారత జట్టును నడిపించడం గొప్ప విషయం. సూర్య జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’ అని గంభీర్ ప్రశంసించాడు.
టీ20 ప్రపంచ కప్‌లో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (84*; 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఒక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. సూర్య ఒంటరి పోరాటం చేశాడు. అమెరికా బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ 161/9తో ఇన్నింగ్స్‌ను ముగించింది. యూఎస్ఏ 132/8కి పరిమితమైంది.
ఇవి కూడా చదవండి:
నేపాల్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు ఇవ్వాలి.. ఐసీసీకి ఆకాశ్ చోప్రా కీలక సూచన
టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌తో వివాదం.. పాక్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది: గంగూలీ