Share News

టీ20 ప్రపంచ కప్: ఫర్హాన్ హాఫ్ సెంచరీ.. ఇంగ్లండ్ టార్గెట్ 165

ABN , Publish Date - Feb 24 , 2026 | 08:52 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా పల్లెకెలె స్టేడియం వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచ కప్: ఫర్హాన్ హాఫ్ సెంచరీ.. ఇంగ్లండ్ టార్గెట్ 165
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా పల్లెకెలె స్టేడియం వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు 165 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్(63; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.


బాబర్ ఆజం(25), ఫఖర్ జమాన్(25), షాదాబ్ ఖాన్(23) ఫర్వాలేదనిపించారు. సయామ్ ఆయుబ్(7), సల్మాన్ అఘా(5), ఉస్మాన్ ఖాన్(8), నవాజ్(0), అఫ్రిది(2) తీవ్రంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, జోఫ్రా ఆర్చర్, జెమీ చెరో 2, ఆదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికే శ్రీలంకపై విజయం సాధించిన ఇంగ్లండ్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో పాక్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి.


ఇవి కూడా చదవండి:

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి లగ్జరీ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?

టీ20 ఆడాల్సిన పద్ధతి ఇది కాదు: సునీల్ గావస్కర్ ఫైర్

Updated Date - Feb 24 , 2026 | 08:54 PM