Share News

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి లగ్జరీ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?

ABN , Publish Date - Feb 24 , 2026 | 06:59 PM

అండర్ 19 ప్రపంచ కప్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తమ లేటెస్ట్ మోడల్ ‘టాటా కర్వ్’ కారును బహుమతిగా అందజేసింది.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి లగ్జరీ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాడు. ఇటీవలే జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025లో అతిపిన్న వయసులోనే క్రికెట్ అరంగేట్రం చేసి మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా వైభవ్ సూర్యవంశీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అండర్ 19 ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా పరుగులు సాధించినందుకు అతడికి ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు లభించింది. ఈ ఘనత సాధించినందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తమ లేటెస్ట్ మోడల్ ‘టాటా కర్వ్’ కారును బహుమతిగా అందజేసింది.


బిహార్ రాజధాని పాట్నాలోని టాటా షోరూంలో వైభవ్ సూర్యవంశీ తన తండ్రి, తమ్ముడితో కలిసి ఈ కొత్త కారును డెలివరీ తీసుకున్నారు. ఈ సందర్భంగా షోరూం సిబ్బంది వైభవ్ కుటుంబానికి ఘనస్వాగతం పలికారు. కారు కీని అందుకుని కేక్ కట్ చేశారు. అయితే వైభవ్ సూర్యవంశీ వయస్సు ప్రస్తుతం 18 ఏళ్ల లూపే ఉండటంతో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీనివల్ల అతడు సొంతంగా కారును నడిపే అవకాశం లేదు.


అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్.. ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదిన విషయం తెలిసిందే. భారత్‌కు రికార్డు స్థాయిలో ఆరో టైటిల్ రావడంలో కీలకపాత్ర పోషించాడు. కేవలం 55 బంతుల్లో శతకం పూర్తి చేసి టోర్నీలో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 439 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. టోర్నీలో అత్యధిక సిక్సర్లు (30) కొట్టిన ఆటగాడిగానూ నిలిచాడు.


ఐపీఎల్‌లో సంచలనం

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్.. గుజరాత్‌పై కేవలం 35 బంతుల్లో శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే 14 ఏళ్ల 32 రోజుల వయసులో శతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా, పాక్ మ్యాచ్

Updated Date - Feb 24 , 2026 | 06:59 PM