Share News

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా, పాక్ మ్యాచ్

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:19 PM

మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగ‌ళ‌వారం ప్రక‌టించింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ  ఇండియా, పాక్ మ్యాచ్
ind vs pak Women

స్పోర్డ్స్ డెస్క్: ప్రస్తుతం పురుషుల టీ20 ప్రపంచ కప్( T20 World Cup 2026)తో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్-8 మ్యాచులు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రియులకు మరో క్రేజీ న్యూస్ వచ్చింది. మహిళల టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ(మంగళవారం) ప్రకటించింది. ఇటీవలే పురుషుల ప్రపంచ కప్-2026 గ్రూప్ స్టేజ్‌లో ఇండియా, పాకిస్థాన్ తలపడగా.. మహిళల జట్టు కూడా తలపడనున్నాయి. మరీ.. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...


మహిళల టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తుండగా.. జూన్ 12న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ పొట్టి ప్రపంచ కప్‌లో మొత్తం మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఐసీసీ మెగా టోర్నీకి ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జ‌ట్లు నేరుగా అర్హత సాధించాయి. అలానే క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ ఈ ఐసీసీ టోర్నీలో స్థానం దక్కించుకున్నాయి.


ఈ మెగా టోర్నీ గ్రూప్- Aలో భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు ఉన్నాయి. వీటితో పాటు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు కూడా గ్రూప్-ఏలో ఉన్నాయి. జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా భారత్, పాక్ తలడనున్నాయి. ఈ టోర్నీలో భార‌త్‌కు ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 5న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది

భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్:

  • జూన్ 14: భారత్ vs పాకిస్థాన్‌, వేదిక: ఎడ్జ్‌బాస్టన్

  • జూన్ 17: భారత్ vs నెద‌ర్లాండ్స్‌, వేదిక: లీడ్స్‌

  • జూన్ 21: భారత్ vs సౌతాఫ్రికా, వేదిక: మాంచెస్టర్‌

  • జూన్ 25: భారత్ vs బంగ్లాదేశ్‌, వేదిక: మాంచెస్టర్‌

  • జూన్ 28: భారత్ vs ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్‌


ఇవి కూడా చదవండి:

ఓడినా.. ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే ప్లేయర్లు

2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?

Updated Date - Feb 24 , 2026 | 06:54 PM