Share News

Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్‌కు భారీ షాక్.. రూ.36 లక్షల జరిమానా

ABN , Publish Date - Jan 08 , 2026 | 07:59 PM

ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కు బిగ్ షాక్ తగిలింది. అతడికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 30 వేల పౌండ్ల(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.36 లక్షలు) జరిమానా విధించింది.

Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్‌కు భారీ షాక్.. రూ.36 లక్షల జరిమానా
Harry Brook

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌(Harry Brook)కు బిగ్ షాక్ తగిలింది. అతడికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) 30 వేల పౌండ్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.36 లక్షలు) జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నవంబర్1 జరిగిన మూడో వ‌న్డేకు ముందు బ్రూక్‌ ఓ నైట్ క్లబ్ బౌన్సర్‌తో దురుసుగా ప్రవ‌ర్తించాడు. బ్రూక్ క్లబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మద్యమత్తులో ఉన్నాడని బౌన్సర్ అతన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ సదరు బౌన్సర్‌తో వాగ్వాదానికి(Nightclub incident Harry Brook) దిగాడు. అయితే ఆ గొడవలో బ్రూక్‌ను బౌన్సర్ కొట్టినట్లు సమాచారం. దాదాపు రెండు నెలల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లాండ్ 3-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.


ఈ వివాదంపై బ్రూక్(Harry Brook) సారీ చెప్పినప్పికీ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది. బ్రూక్ దే తప్పని ఈసీబీ దర్యాప్తులో తేలింది. దీంతో అతడికి 30,000 పౌండ్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.33 లక్షలు) భారీ జరిమానా ఈసీబీ(ECB Action Fined) విధించింది. అంతేకాకుండా ఇదే చివరి అవకాశం అంటూ ఈసీబీ హెచ్చరించింది. కాగా యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లాండ్ ఘోర ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లాండ్ కోల్పోయింది. ఈ ఘోర పరాభవానికి ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యమే కారణమని ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్లు విమర్శిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Punjab vs Mumbai: ఉత్కంఠ పోరులో పంజాబ్ సంచలన విజయం..

Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..

Updated Date - Jan 08 , 2026 | 08:09 PM