Share News

దులీప్ ట్రోఫీ ఫైనల్: చెలరేగిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ భారీ స్కోర్

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:29 PM

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతూన్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ జట్టు 708 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.

దులీప్ ట్రోఫీ ఫైనల్: చెలరేగిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ భారీ స్కోర్
Duleep Trophy Final

ఇంటర్నెట్ డెస్క్: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతూన్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ జట్టు 708 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. దీంతో రెండో రోజు ఆట కూడా ముగిసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 270 పరుగులు చేశాడు. త్రుటిలో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరో బ్యాటర్ కుమార్ కుషాగ్రా(101) సెంచరీతో చెలరేగాడు.


ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(72), శిఖర్ మోహన్(85) హాఫ్ సెంచరీలతో రాణించారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(44), అనుకుల్ రాయ్(45), కురేషి(40) పర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ బ్యాటర్లను కట్టడి చేయడానికి సౌత్ జోన్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. 384/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఈస్ట్ జోన్.. చెలరేగి ఆడింది. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్ 4, సీవీ మిలింద్, శ్రేయస్ గోపాల్ తలో 2, రషీద్ ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్

భారత్-జపాన్ స్పెషల్ టీ20 మ్యాచ్.. యూట్యూబ్‌లో ప్రసారం?

Updated Date - Sep 07 , 2026 | 05:29 PM