వెంటనే మరో ప్రపంచ కప్ నిర్వహిస్తాం: ట్రంప్
ABN , Publish Date - Jul 20 , 2026 | 09:42 AM
ఫిఫా ప్రపంచ కప్2026 ఫైనల్‌లో1-0 తేడాతో అర్జెంటీనాపై స్పెయిన్ విజేతగా నిలిచింది. స్పెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ సమయంలో ట్రంప్.. ఫిఫా నిర్వాహకులకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: మెక్సికో, కెనడాతో కలిసి ఫిఫా ప్రపంచ కప్(FIFA World Cup 2026)కు అమెరికా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో1-0 తేడాతో అర్జెంటీనాపై స్పెయిన్ విజేతగా నిలిచింది. స్పెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. స్పెయిన్ జట్టుకు ట్రోఫీని అందించే సమయంలో ఆయన.. ఫిఫా నిర్వాహకులకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే మరో ప్రపంచ కప్‌ను అమెరికాలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని.. ఈ విషయంపై ఫిఫా అధ్యక్షుడు గియాన్ని కోరుతామని ట్రంప్ తెలిపారు.
ట్రోఫీ అందజేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ...' ఫిఫా(FIFA)కు ఓ విన్నపం. ఈ ప్రపంచ కప్ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని మరోసారి వెంటనే ప్రపంచకప్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. గియాని మీరు విన్నారు కదా?. మీరు రెండు దేశాల పేర్లను ప్రకటించండి. అందులో మా దేశం పేరు ఉండాలి. ఆ తర్వాత మరో దేశం పేరును ప్రకటించండి. దీని వల్ల బయట నుంచి వచ్చే ఆగ్రహావేశాలు కొంతమేరకైనా తగ్గుతాయి’ అని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.
ఒకవేళ ట్రంప్ తన పదవీకాలంలో ప్రపంచ కప్ మళ్లీ అమెరికాలో నిర్వహించాలని సూచించినా, అది జరగదు. ఎందుకంటే ఆయన పదవీకాలం 2028లో ముగుస్తుంది. 2030 ప్రపంచ కప్‌కు మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ ఆతిథ్యం ఇవ్వనుండగా, 2034 ఎడిషన్ సౌదీ అరేబియాలో జరగనుంది. తదుపరి ప్రపంచ కప్ 2038లో జరగనుంది. ప్రస్తుత సైకిల్ నిబంధనల ప్రకారం ఓషియానియా, ఉత్తర అమెరికా ఆతిథ్యం ఇవ్వడానికి అర్హత సాధిస్తాయి. కాబట్టి, దానికి అమెరికా ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దానికి ఇంకా 12 సంవత్సరాల సమయం ఉంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్ 2026: అర్జెంటీనా ఓటమి కారణలు ఇవే!
స్పెయిన్ విషయంలో ఆ సెంటిమెంట్ పని చేసింది!