MI Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Jan 10 , 2026 | 09:13 PM
నవీ ముంబై వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 195 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన దిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ ఎంచుకుని ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ముందు 196 పరుగుల టార్గెట్ ను ముంబై ఉంచింది. మరోవైపు ఈ మ్యాచ్‌తో జెమీమా రోడ్రిగ్స్ అరుదైన ఘనత సాధించింది. 25 ఏళ్ల 127 రోజుల జెమీమా రోడ్రిగ్స్ డబ్ల్యూపీఎల్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తోన్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. గతంలో 2023లో స్మృతి మంధాన (26 ఏళ్ల 230 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74*), నాట్ స్కివెర్ బ్రంట్ (70) అర్ధ సెంచరీలు అదరగొట్టారు. నికోలా కారీ (21) ఫర్వాలేదనిపించింది. ఢిల్లీ బౌలర్లలో నందని శర్మ 2 వికెట్లు సాధించగా... హెన్రీ, శ్రీ చరణి చెరో వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్