Share News

Andhra Pradesh: వైద్యులు ని‌స్వార్థంతో సమాజానికి అండగా నిలబడాలి: డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Jan 10 , 2026 | 07:41 PM

వైద్యులు బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు.

Andhra Pradesh: వైద్యులు ని‌స్వార్థంతో సమాజానికి అండగా నిలబడాలి: డిప్యూటీ సీఎం పవన్

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు (శనివారం) కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ లో (RMC) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక్క రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి నిరుపేదలకు సేవ అందించాలని విద్యార్థులనుద్దేశించి కోరారు. వైద్య వృత్తి కేవలం ఒక ఉద్యోగం కాదని, అది మానవత్వంతో కూడిన దైవ కార్యమని పవన్ అన్నారు.


పూర్వ విద్యార్థులు రూ.10.11కోట్లతో నూతన భవనాన్ని నిర్మించడానికి ముందుకు రావడం ఎంతో అభినందించాల్సిన విషయం అన్నారు. ప్రతి కళాశాల పూర్వ విద్యార్థులు ఇలా ఆలోచిస్తే ఏ కళాశాలా ప్రైవేటు పరం కాదని, యువతలో విశాల దృక్పథం రావాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం పవన్. విద్యావంతులు కులమతాలకు అతీతంగా సమాజం గురించి ఆలోచించాలని, ఇరుకు మనస్తత్వాలు అభివృద్ధికి ఆకంటంగా మారుతాయని పవన్ కల్యాణ్ అన్నారు. అరకు ప్రాంతంలో సికిల్ సెల్ అనీమియా బాధితుల కోసం దాతల సహకారంతో బ్లడ్ బ్యాంక్ నిర్మిస్తున్నామని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 08:24 PM