Share News

ఆసియా కప్ 2026లో భారత్ టైటిల్ గెలిచినా.. నో ట్రోఫీ!

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:00 PM

మహిళా టీ20 ఆసియా కప్2026లో భారత్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి.. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది.

ఆసియా కప్ 2026లో భారత్ టైటిల్ గెలిచినా.. నో ట్రోఫీ!
Women's T20 Asia Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: మహిళా టీ20 ఆసియా కప్ 2026లో భారత్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి.. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. టీమిండియా గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీఫైనల్‌లో తలపడనుంది. గ్రూప్-బిలో రెండో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచే స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇవాళ(మంగళవారం)యూఏఈ, బంగ్లా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో తేలిపోనుంది.


ఆసియా కప్ గత చరిత్రను గమనిస్తే.. భారత్ టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అయితే ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన విజేతగా నిలిచినా.. ట్రోఫీ దక్కే పరిస్థితులు కనిపించడం లేదని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఛైర్మన్‪గా ఉన్నారు. ఏసీసీ హోదాలో ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరై.. ట్రోఫీని అందజేయనున్నాడు.


ఈ విషయంపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. చీఫ్ గెస్ట్ మోసిన్ నఖ్వీనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతోన్నాయి. నఖ్వీ కారణంగా గతేడాది పురుషుల ఆసియా కప్ 2025 ఫైనల్ రసాభాసగా మారిన సంగతి తెలిపిందే. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించింది. నఖ్వీ కూడా తానే ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టాడు. చివరకు ట్రోఫీని తనవెంట తీసుకెళ్లాడు.


దీంతో టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. మహిళల ఆసియా కప్ ఫైనల్ అనంతరం కూడా ఇవే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ విజేతగా నిలిస్తే మాత్రం.. నఖ్వీ చేతుల మీదు టైటిల్ తీసుకోదు. అదే జరిగితే మరోసారి ట్రోఫీ లేకుండానే టీమిండియా ఆసియా కప్ విజేతగా స్వదేశానికి రావాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన దీప్తి శర్మ

'కేసీఆర్ క్షమాపణ చెప్తే ఆయన హుందాతనం పెరిగేది'

Updated Date - Sep 08 , 2026 | 08:03 PM