Share News

వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్‌‌ను వెల్లడించిన కోచ్ మనీష్

ABN , Publish Date - Jun 15 , 2026 | 08:35 AM

ఐపీఎల్‌2026లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికై వార్తల్లో నిలిచాడు. బాల్యంలో వైభవ్ తీసుకున్న క్రికెట్ శిక్షణ గురించి, అతడి తల్లిదండ్రులు చేసిన త్యాగం గురించి వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్‌‌ను వెల్లడించిన కోచ్ మనీష్
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌2026లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికై వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్‌లో 237 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో, 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఈ కుర్రాడి అద్భుతమైన బ్యాటింగ్ వెనుక ఆరేళ్ల కఠోర శ్రమ దాగుంది. బాల్యంలో వైభవ్ తీసుకున్న క్రికెట్ శిక్షణ గురించి, అతడి తల్లిదండ్రులు చేసిన త్యాగం గురించి వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా వెల్లడించాడు.


కోచ్ మనీష్ ఓఝా కథనం ప్రకారం.. 8 ఏళ్ల వయసులోనే పాట్నాలోని అకాడమీకి వచ్చిన వైభవ్‌కు క్రికెట్‪పై విపరీతమైన మక్కువ ఉండేది. 10 ఏళ్ల వయసు నుంచి టెన్నిస్ బాల్ వదిలి హార్డ్ బాల్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టిన వైభవ్.. రోజూ ఉదయం 7.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు బ్యాటింగ్ చేసేవాడు. రోజుకు కనీసం 100 ఓవర్లు ఎదుర్కొనేవాడు. కోచ్ ఇచ్చే త్రో డౌన్స్, అకాడమీ బౌలర్లు, ఆపై బౌలింగ్ మెషీన్ సహాయంతో బౌలింగ్ చేసినా కూడా వైభవ్ అలసిపోకుండా ఆడేవాడు. ఈ సుదీర్ఘ శిక్షణే అతనిలో తిరుగులేని 'మజిల్ మెమరీ' ని నిర్మించి, మైదానంలో సులువుగా సిక్సర్లు బాదేలా చేసిందని ఓఝా పేర్కొన్నారు.


ఈ ప్రయాణంలో వైభవ్ తల్లిదండ్రులు సంజీవ్, ఆరతిల త్యాగం వెలకట్టలేనిది. సమస్తిపూర్ నుండి పాట్నాకు ప్రతిరోజూ రెండున్నర గంటల పాటు ప్రయాణం చేసేవారు. ఇందుకోసం వైభవ్ తల్లి తెల్లవారుజామున 2 గంటలకే లేచి వంట చేసేవారు. వైభవ్ కోసమే కాకుండా, అతడితో పాటు వచ్చే నెట్ బౌలర్లు, అకాడమీలోని పేద పిల్లల కోసం ప్రతిరోజూ 10 నుంచి15 మందికి భోజనం సిద్ధం చేసి పంపేవారు. వైభవ్ సాధించిన ఈ ఘనతతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐదేళ్ల వయసున్న పిల్లలను సైతం తల్లిదండ్రులు అకాడమీలకు తీసుకువస్తూ 'నెక్స్ట్ వైభవ్' లా మార్చాలని కోరుకుంటున్నారని కోచ్ ఓఝా సంతోషం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

భారత్ చేతిలో ఓటమి.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కీలక వ్యాఖ్యలు

హడలెత్తించిన మొరాకో

Updated Date - Jun 15 , 2026 | 09:14 AM