Share News

రికార్డులపై దృష్టి పెట్టలేదు.. నా బలాలనే నమ్ముకున్నా: వైభవ్

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:52 PM

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ2026లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ (53 బంతులు, 204 పరుగులు) విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రికార్డులపై దృష్టి పెట్టలేదు.. నా బలాలనే నమ్ముకున్నా: వైభవ్
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ2026లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ (53 బంతులు, 204 పరుగులు) విధ్వంసకర బ్యాటింగ్‌తో 250 పరుగుల లక్ష్యాన్నియువ భారత్ కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు.


మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ.. ‘గత రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లు సాధించలేకపోయాము. ఈ మ్యాచ్‌లోనూ ప్రారంభంలో ఆచితూచి ఆడాలని భావించాను. అయితే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని అర్థమైంది. దీంతో నా బలాలపై నమ్మకముంచి ఆడాను. రికార్డుల గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. పిచ్ బౌలర్లకు సహకరిస్తే సమయం ఎక్కువ తీసుకున్న క్రీజులో ఉండాలనుకున్నాను. కానీ బ్యాటింగ్‌ సులభంగా ఉండటంతో నా శైలిలో ఆడగలిగా' అని వైభవ్ పేర్కొన్నాడు.


ఇదే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గురించి అడగ్గా.. బిహార్‌ జట్టుకు నాయకత్వం వహించడం చాలా సంతోషంగా ఉందని వైభవ్ తెలిపాడు. తమ జట్టు కూడా బాగా ఆడుతోందని, ఇదే ప్రదర్శనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. సీనియర్‌ ఆటగాళ్లతో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, వారంతా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెబుతుంటారని పేర్కొన్నాడు. సీనియర్ల సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నానని వైభవ్‌ సూర్యవంశీ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 24 , 2026 | 09:57 PM