దివ్యాంగుడు మనోహర్ డ్యాన్స్ వీడియోకు మంత్రి లోకేష్ ఫిదా.. ఎక్స్‌లో ప్రశంసలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:45 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఓ ఆసక్తికర వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దివ్యాంగుడైన మనోహర్ ప్రతిభను ఆయన ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఓ ఆసక్తికర వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దివ్యాంగుడైన మనోహర్ ప్రతిభను ఆయన ప్రశంసించారు. అతడి డాన్స్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో మంత్రి లోకేష్ చూశారు. మనోహర్ గురించి వివరాలను ఆరా తీసిన ఆయన అతడి ప్రతిభను ప్రశంసిస్తూ ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.
‘నీ సంకల్పానికి ఆ విధి సైతం చప్పట్లు కొట్టి అభినందించాల్సిందే మనోహర్. నీ ఆత్మవిశ్వాసం ఓ అద్భుతం. సోషల్ మీడియాలో నీ డ్యాన్స్ వీడియో చూసి వివరాలు తెలుసుకున్నాను. నాటు నాటు పాటకు డ్యాన్సే కాదు.. మనోహర్ షాట్ పుట్ అథ్లెట్, పాటలు కూడా పాడతాడట. ఆర్డీటీలో మనోహర్ లాంటి వందలాది దివ్యాంగులకు నైతిక విలువలతో కూడిన విద్య, క్రీడలు,జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్నారని తెలిసి సంతోషించాను. ఆకాశమే హద్దుగా ప్రయత్నిస్తున్న మీరు బాలబాలికల భవిష్యత్తుకు వెలుగు దీపికలు. నిండైన ఆత్మవిశ్వాసపు ప్రతీకలు.. మీ ప్రతిభ అనన్య సామాన్యం. మీ అందరికీ అభినందనలు, ఆశీస్సులు’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ
బనగానపల్లె సర్పంచ్‌గా మంత్రి భార్య బీసీ ఇందిరా రెడ్డి ఏకగ్రీవం