వైభవ్ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా!
ABN , Publish Date - May 10 , 2026 | 10:39 AM
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో వైభవ్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ సీజన్‌లో అతడి సిక్సర్ల సంఖ్య 40కి చేరింది.
మొదటి స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ ఉన్నాడు. అతడు 2024 సీజన్‌లో ఓవరాల్‌గా కొట్టిన సిక్సర్ల సంఖ్య 42. అభిషేక్ రికార్డు బద్దలు కొట్టేందుకు వైభవ్‌కు 2 సిక్సర్లు మాత్రమే కావాలి. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు పూర్తవ్వలేదు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి వైభవ్ ఆ రికార్డు బద్దలు కొట్టడమే కాకుండా మరెన్ని సిక్సులు కొడతాడో చూడాలి. వీరి తర్వాత శ్రేయస్ అయ్యర్ (39 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (38 సిక్సర్లు), సూర్యకుమార్ (38 సిక్సర్లు), రిషబ్ పంత్ (37 సిక్సర్లు) ఉన్నారు.
అలానే వైభవ్ మరో రికార్డును నమోదు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో తొలి పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో వైభవ్ సూర్యవంశీ(30) తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ( 29 సిక్సర్లు, 2024), అభిషేక్ శర్మ (27 సిక్సర్లు, 2026 సీజన్), జయసూర్య (22 సిక్సర్లు, 2008 ), ట్రావిస్ హెడ్ (22 సిక్సర్లు, 2024), జైస్వాల్ (22 సిక్సర్లు, 2025) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 152 పరుగులకే ఆలౌటైంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: గిల్, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీలు..