సెహ్వాగ్ చెత్త రికార్డు బ్రేక్ చేసిన టామ్ లాథమ్..
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:47 PM
వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే లాథమ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కివీస్ కెప్టెన్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: బేసిన్ రిజర్వ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఘోరంగా విఫలమయ్యాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ధాటికి రెండు ఇన్నింగ్స్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే లాథమ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కివీస్ కెప్టెన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాక టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డును లాథమ్ బ్రేక్ చేశాడు.
రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటైన మూడో కివీస్ కెప్టెన్‌గా లాథమ్ నిలిచాడు. గతంలో హ్యారీ కేవ్ (వెస్టిండీస్‌పై,1956), స్టీఫెన్ ఫ్లెమింగ్ (ఆస్ట్రేలియాపై, 1997)లు ఈ అవాంఛిత రికార్డును నెలకొల్పారు. భారత్‌పై డకౌటైన రెండో న్యూజిలాండ్ ఓపెనర్‌గా లాథమ్ నిలిచాడు. 2010లో అహ్మదాబాద్ టెస్టులో కివీస్ ఓపెనర్ టిమ్ మెకింతోష్ రెండు ఇన్నింగ్స్‌లలో డకౌట్ అయ్యాడు. అదేవిధంగా టెస్టుల్లో అత్యధిక సార్లు డకౌటైన నాలుగో ఓపెనర్‌గా లాథమ్ నిలిచాడు. టెస్టు కెరీర్‌లో ఇప్పటి వరకు లాథమ్ 16(వెల్లింగ్టన్ మ్యాచ్‌తో కలిపి) సార్లు డకౌట్ అయ్యాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సెహ్వాగ్(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్ చెత్త రికార్డును లాథమ్ బ్రేక్ చేశాడు.
టెస్టు ఓపెనర్‌గా అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్లు
క్రెయిగ్ బ్రాత్‌వైట్-19
మైక్ అథర్టన్-17
మార్వన్ ఆటపట్టు-16
టామ్ లాథమ్-16
వీరేంద్ర సెహ్వాగ్-15
ఇవి కూడా చదవండి:
పాక్ ప్లేయర్లే కాదు.. ఆ దేశ అంపైర్లు కూడా ఓవరాక్షనే.. ఈ వీడియోనే సాక్ష్యం!
టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. మూడో బౌలర్‌గా