IND vs SL: శ్రీలంకపై భారత్ ఘన విజయం
ABN , Publish Date - Aug 19 , 2026 | 02:10 PM
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిడింయా గెలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మానవ్ సుతార్ ఫైఫర్ (6/55) నమోదు చేశాడు.
శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుష (84), ధనంజయ డి సిల్వా (59) హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ్ కృష్ణ 2.. సిరాజ్, జడేజా చెరో వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 193 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక 206 పరుగులు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో టెస్టు ఆగస్టు 22 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనుంది.
ఇవి కూడా చదవండి:
తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్
కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్