టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:22 PM
టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ టాస్ గెలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. ఈ మహాసంగ్రామానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. టీ20 నంబర్ వన్ బ్యాటర్, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో అయినా రాణిస్తాడా? లేదా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాప్ సింగర్ రికీ మార్టిన్, భారత్ కు చెందిన సింగర్లు ఫల్గుణి పాఠక్, సుఖ్‌బీర్ తమ ప్రదర్శనలతో అలరించారు.
తుది జట్లు ఇవే:
భారత్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్:
టిమ్ సెఫర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జాకబ్ డఫీ, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్