Share News

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే!

ABN , Publish Date - Mar 26 , 2026 | 09:17 PM

ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌‌ను బీసీసీఐ ఇవాళ (గురువారం) విడుదల చేసింది. ఈ దశలో 50 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20, రెండో దశలో 50 కలుపుకుని మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఐపీఎల్ 2026:  సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే!
Sunrisers Hyderabad IPL 2026

స్పోర్ట్ డెస్క్: ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌‌ను బీసీసీఐ ఇవాళ (గురువారం) విడుదల చేసింది. ఈ దశలో 50 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20, రెండో దశలో 50 కలుపుకుని మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్‌కు, ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో వెలువడుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల ఏకైక ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో విడత ప్రకటించిన షెడ్యూల్‌లో 10 మ్యాచ్‌లు ఆడనుంది. రెండో దశ ప్రారంభ మ్యాచ్‌లోనే రాజస్థాన్‌ రాయల్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు జరుగనుంది. మరి.. ఐపీఎల్ 2026లో ఎస్ఆర్‌హెచ్ పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం...


ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు..

తొలి దశ:

మార్చి 28: ఎస్ఆర్‌హెచ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు)

ఏప్రిల్‌ 2: ఎస్ఆర్‌హెచ్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (కోల్‌కతా, రాత్రి 7:30 గంటలకు)

ఏప్రిల్‌ 5: ఎస్ఆర్‌హెచ్ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌(హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)

ఏప్రిల్‌ 11: ఎస్ఆర్‌హెచ్ vs పంజాబ్‌ కింగ్స్‌ (ముల్లాన్‌పూర్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)

రెండవ దశ:

ఏప్రిల్‌ 18: ఎస్ఆర్‌హెచ్ vs చెన్నై సూపర్ కింగ్స్(హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)

ఏప్రిల్‌ 21: ఎస్ఆర్‌హెచ్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌(హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)

ఏప్రిల్‌ 25: ఎస్ఆర్‌హెచ్ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (జైపూర్‌, రాత్రి 7:30 గంటలకు)

ఏప్రిల్‌ 29: ఎస్ఆర్‌హెచ్ vs ముంబై ఇండియన్స్‌ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)

మే 3: ఎస్ఆర్‌హెచ్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)

మే 6: ఎస్ఆర్‌హెచ్ vs పంజాబ్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)

మే 12: ఎస్ఆర్‌హెచ్ vs గుజరాత్‌ టైటాన్స్‌ (అహ్మదాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)

మే 18: ఎస్ఆర్‌హెచ్ vs చెన్నై సూపర్ కింగ్స్ తో (చెన్నై, రాత్రి 7:30 గంటలకు)

మే 22: ఎస్ఆర్‌హెచ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)


సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016, 2018, 2024లో మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరినా, 2016లో ఒక్కసారి మాత్రమే టైటిల్‌ను గెలుచుకోగలిగింది. ఈ ఫ్రాంచైజీ తమ ఖాతాలో మరో ట్రోఫీని చేర్చుకోవాలని ఆశిస్తోంది. ఈ సీజన్ లో ఎస్ఆర్‌హెచ్ తమ మ్యాచ్‌ను మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ప్రారంభించనుంది.


ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 26 , 2026 | 09:37 PM