Share News

భారత్ ఫీల్డింగ్‌పై గావస్కర్ అసహనం.. వీడియో వైరల్!

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:58 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫీల్డింగ్‌లో కొన్ని వైఫల్యాలు కనిపించాయి. ముఖ్యంగా మైదానంలో వారు నిల్చునే పొజిషన్ పై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

భారత్ ఫీల్డింగ్‌పై గావస్కర్ అసహనం.. వీడియో వైరల్!
Sunil Gavaskar

స్పోర్ట్స్ డెస్క్: క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫీల్డింగ్‌లో వైఫల్యాలు కనిపించాయి.రెండో రోజు ఆటలో ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో నాథన్ స్మిత్ బ్యాట్ అంచు తాకిన బంతి.. రెండో స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ముందు పడటంతో త్రుటిలో క్యాచ్ మిస్సైంది. దీంతో కామెంట్రీ బాక్స్‌లో మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


రెండో ఆట ముగిసిన తర్వాత తన ఆగ్రహానికి గల కారణాన్ని గావస్కర్ వివరించారు. క్యాచ్‌లు జారవిడవడం ఆటలో సహజమే అయినా, ఫీల్డర్ల స్థానాల (పొజిషన్) విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలి రోజు ఆట నుంచే భారత స్లిప్ ఫీల్డర్లు కొంచెం ముందుకు వచ్చి నిల్చోవాలని తాను చెబుతున్నానని, సరైన స్థానంలో ఉంటే మరికొన్ని క్యాచ్‌లు అందుకునే అవకాశం ఉండేదనిపేర్కొన్నారు. చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటేనే పెద్ద విజయాలు అందుతాయని గావస్కర్ హితవు పలికారు.


న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌కు క్యాచ్‌ల సమస్య వెంటాడుతోంది. వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా టీమిండియా ప్లేయర్లు హెన్రీ నికోల్స్ (175), డారిల్ మిచెల్ క్యాచ్‌లను వదిలేయడం జట్టుపై ప్రభావం చూపింది. ఇక క్రైస్ట్‌చర్చ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ పలు ఈజీ క్యాచ్ లను చేజార్చడంతో కివీస్ 356 పరుగులు చేయగలిగింది. మరోవైపు స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే మీడియా సమావేశంలో జట్టు ఫీల్డింగ్‌ను సమర్థించుకున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో క్యాచుల విషయంలో కఠోరంగా శ్రమిస్తున్నామని, మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించాల్సి ఉందని అన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..తొలి ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్ 5 వికెట్లు తీసినా, ఆ తర్వాత బ్యాటింగ్‌లో తడబడిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి కష్టాల్లో నిలిచింది.


ఇవి కూడా చదవండి:

‘సీట్ బెల్టులు బిగించండి’.. రోహిత్ కెప్టెన్సీపై సూర్య ఆసక్తికర పోస్ట్!

ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..

డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
భారత్ టెస్టు చరిత్రలో చెత్త భాగస్వామ్యం.. 91 బంతుల్లో 12 పరుగులే!
భారత్ టెస్టు చరిత్రలో చెత్త భాగస్వామ్యం.. 91 బంతుల్లో

Updated Date - Nov 28 , 2026 | 05:02 PM