Share News

‘సీట్ బెల్టులు బిగించండి’.. రోహిత్ కెప్టెన్సీపై సూర్య ఆసక్తికర పోస్ట్!

ABN , Publish Date - Nov 28 , 2026 | 02:42 PM

ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా తిరిగి రోహిత్ శర్మను నియమించింది. రోహిత్ శర్మ మరోసారి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.

 ‘సీట్ బెల్టులు బిగించండి’.. రోహిత్ కెప్టెన్సీపై సూర్య ఆసక్తికర పోస్ట్!
Rohit Sharma Captaincy

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ తన కొత్త సారథిని ప్రకటించింది. ఇటీవల జరిగిన ట్రెడ్ లో హార్దిక్‌ పాండ్య పంజాబ్‌కు వెళ్లడంతో కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి రోహిత్ శర్మకే అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2013 నుంచి 2024 మధ్యలో ముంబైకి ఐదు కప్పులను అందించిన నాయకుడిగా మరోసారి రోహిత్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై సూర్యకుమార్‌ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.


‘నాయకుడు, సోదరుడు, మార్గనిర్దేశకుడు.. ముంబై అభిమానులరా మీ సీట్‌ బెల్టులను బిగించి పెట్టుకోండి’ అంటూ సూర్య పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ‘ముంబై కా రాజా’ తిరిగి వచ్చేశాడంటూ సోషల్‌ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. మరోవైపు రోహిత్ శర్మకు జస్ప్రీత్ బుమ్రాను డిప్యూటీగా నియమించాలని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ భావించిందట. కానీ, స్టార్ పేసర్ మాత్రం విముఖత ప్రదర్శించినట్లు సమాచారం. తొలి నుంచీ కెప్టెన్ రేసులో సూర్యకుమార్, బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు.


కానీ, మరోసారి రోహిత్‌కే సారథ్య బాధ్యతలను అప్పగిస్తూ ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. బుమ్రా తిరస్కరిస్తే.. వైస్ కెప్టెన్‌గా తిలక్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్‌లో రోహిత్ కెరీర్ పరిశీలించినట్లు అయితే.. అతడు 281 మ్యాచ్‌లు ఆడిన 7,329 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో విరాట్‌ కోహ్లి (9,336) తర్వాత రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా 158 మ్యాచ్‌లాడిన రోహిత్‌ 87 విజయాలు అందించాడు.


ఇవి కూడా చదవండి:

కొందరు బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదు..

ఆ జోరు కనిపించడం లేదు.. బుమ్రా బౌలింగ్‌పై గావస్కర్ అసంతృప్తి

Updated Date - Nov 28 , 2026 | 02:57 PM