Share News

మహిళల ప్రపంచ కప్ 2026: భారత్ స్కోర్ 158/7

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:58 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

మహిళల ప్రపంచ కప్ 2026: భారత్ స్కోర్ 158/7
South Africa Target 159

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ (15 బంతులు, 31) రాణించింది. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 29 , హర్మన్‌ప్రీత్ కౌర్ 24, స్మృతి మంధాన 17, యాస్తికా భాటియా 15, రిచా ఘోష్ 15, జెమీమా12 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ , మారిజెన్ కాప్ చెరో రెండు వికెట్లు సాధించారు. మ్లాబా, అయాబొంగా ఖాకా, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు.


ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(17) స్వల్ప పరుగులకే ఔటైంది. 3 ఓవర్లో టీమిండియా స్కోర్ 30 పరుగుల వద్ద మారిజెన్ కాప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. ఆ తర్వాత షఫాలీ వర్మ, భాటియా జోడీ కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. వీరిద్దరూ 24 పరుగుల భాగస్వామ్యాన్ని మాత్రమే నెలకొల్పారు. 54 పరుగుల వద్ద ఇస్మాయిల్ బౌలింగ్‌లో షఫాలీ వర్మ పెవిలియన్ చేరింది. హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ కాసేపు వికెట్లు పడకుండా ఆపారు. చివర్లో వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఫర్వాలేదనిపించింది. మొత్తంగా సౌతాఫ్రికా ముందు 158 పరుగుల మెరుగైన స్కోర్‪నే టీమిండియా నిర్దేశించింది.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

Updated Date - Jun 21 , 2026 | 09:24 PM