Share News

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ABN , Publish Date - Jun 21 , 2026 | 07:49 PM

రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
New Zealand vs England 2nd Test

స్పోర్ట్స్ డెస్క్: రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ (100) అద్భుత సెంచరీతో బ్లాక్‌ క్యాప్స్‌ను ఆదుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టుపై పేసర్ మ్యాట్ హెన్రీ నిప్పులు చెరిగాడు. అతడు (5/80) ధాటికి 291 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ 100 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.


పర్యాటక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. సీనియర్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌(121) సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. రచిన్ రవీంద్ర (76), మిచెల్ (68) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా న్యూజిలాండ్ 362 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 463 పరుగుల భారీ టార్గెట్ కివీస్ నిర్దేశించింది.


ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 209 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌటైంది. హెన్రీ ఆరు వికెట్ల పడగొట్టి ఇంగ్లీష్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు జేమిసన్ మూడు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (77), హ్యారీ బ్రూక్ (58) మిగతా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాట్ హెన్రీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మూడో టెస్ట్ మ్యాచ్ జూన్ 25 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది.


ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

Updated Date - Jun 21 , 2026 | 07:49 PM