Share News

ఐపీఎల్ 2026: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. చెన్నై ముందు భారీ టార్గెట్...

ABN , Publish Date - Apr 05 , 2026 | 09:21 PM

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది.

ఐపీఎల్ 2026: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. చెన్నై ముందు భారీ టార్గెట్...
RCB Score 172

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్.. చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దేవ్‌దత్ పటిక్కల్(50) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు.


మిగిలిన బ్యాటర్లలో రజత్ పటిదార్(48*), ఫిల్ సాల్ట్(46), విరాట్ కోహ్లీ(28) కూడా ఆకట్టుకున్నారు. రజత్ పటిదార్ కేవలం19 బంతుల్లోనే 48 పరుగులు చేసి.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏ దశలోనూ సీఎస్కే బౌలర్లు.. ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ప్రారంభంలో ఆచితూచి ఆడిన బెంగళూరు బ్యాటర్లు.. చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, శివం దూబె తలో వికెట్ తీశారు. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ పై బెంగళూరు అత్యధిక స్కోర్(250) ఇదే కావడం గమన్హారం.


ఇవి కూడా చదవండి:

లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం

చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్

Updated Date - Apr 05 , 2026 | 09:37 PM