Share News

విజయంతో హోం గ్రౌండ్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైన ఆర్సీబీ!

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:16 PM

నేడు గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. దీనికి చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్‌కు ఇదే చివరి మ్యాచ్. ఇకపై ఆడే మ్యాచ్‌లన్నీ కూడా అవుటాఫ్ బెంగళూరే.

విజయంతో హోం గ్రౌండ్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైన ఆర్సీబీ!
Royal Challengers Bangalore

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్‌కు ఇదే చివరి మ్యాచ్. ఇకపై ఆడే మ్యాచ్‌లన్నీ కూడా బెంగళూరు బయటనే ఉంటాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి సొంతగడ్డకు వీడ్కోలు చెప్పాలనే పట్టుదలతో రజత్ పాటిదార్ సేన ఉంది.


ఇవాళ జరిగే మ్యాచ్.. హోం గ్రౌండ్‌లో బెంగళూరు చివరి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగం మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. చిన్నస్వామి పిచ్‌కి అనుకూలమైన బౌలర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకోవడంలో ఆర్సీబీ చాలా జాగ్రత్తగా ఉండాలి.


గుజరాత్ జట్టుకు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడా వంటి బౌలర్లు ఉన్నప్పటికీ, బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే స్పిన్నర్ రషీద్ ఖాన్. చిన్నస్వామి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది కాబట్టి, ఆర్సీబీ ఈ మిడిల్ ఓవర్లలో రన్ రేట్‌ను పెంచడం ద్వారా భారీ స్కోర్ సాధించగలుగుతుంది. ఈ సీజన్‌లో ఆర్సీబి చిన్నస్వామి స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో మూడింటిలో గెలిచి, ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తంగా ఇరుజట్లు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో మైదానంలో హోరాహోరీ పోరు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్

మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!

Updated Date - Apr 24 , 2026 | 03:57 PM