Share News

డాక్టర్ అవతారమెత్తిన జడేజా.. స్టెతస్కోప్‌తో సందడి!

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:04 PM

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ డగౌట్‌కే పరిమితమైన రవీంద్ర జడేజా.. కాసేపు డాక్టర్‌గా మారిపోయాడు. స్టెత్‌స్కోప్‌ను మెడలో వేసుకుని పక్కన కూర్చున్న సిబ్బందిని పరీక్షించాడు.

డాక్టర్ అవతారమెత్తిన జడేజా.. స్టెతస్కోప్‌తో సందడి!
Jadeja Viral Video

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన సరదా చేష్టలతో అందరినీ నవ్వించాడు. ఆదివారం హేగ్లీ ఓవల్ మైదానంలో భారత సహాయక సిబ్బందితో కలిసి డగౌట్‌లో కూర్చున్న జడేజా.. మెడలో స్టెతస్కోప్ వేసుకుని వైద్యుడిలా కనిపించాడు. తొలుత తన గుండెచప్పుడును తానే పరీక్షించుకున్న జడ్డూ, ఆ తర్వాత పక్కనున్న సహాయక సిబ్బందిలో ఒకరిని వైద్య పరీక్షలు చేస్తున్నట్లు సందడి చేశాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


బ్యాట్, బాల్ చేతిలో లేని సందర్భంలో జడేజా ఊరికే కూర్చోరంటూ కామెంటరీ ప్యానలిస్ట్ అజయ్ జడేజా సరదాగా వ్యాఖ్యానించారు. కీలక మ్యాచ్‌లో టీమిండియా ఒత్తిడిలో ఉన్న వేళ.. జడ్డూ డాక్టర్ అవతారం అభిమానులకు కాసేపు నవ్వులు పంచింది.న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు (వెల్లింగ్టన్)తో పాటు రెండో టెస్టు తుది జట్టులోనూ జడేజాకు చోటు దక్కలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టు యాజమాన్యం వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది. మరోవైపు, మైదానంలో గిల్ సేన పోరాటం కొనసాగుతోంది. కివీస్ తొలి ఇన్నింగ్స్ 356 పరుగులకు బదులుగా భారత్ 246 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి, మొత్తం 243 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొత్తంగా వైద్యుడిగా మారిన జడేజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

విదేశీ వికెట్లలో బుమ్రా రికార్డు.. శ్రీనాథ్‌ను దాటేశాడు!

హర్భజన్ సింగ్‌కు పాక్ అభిమాని స్పెషల్ రిక్వెస్ట్.. భజ్జీ రియాక్షన్ ఇదే!

Updated Date - Nov 29 , 2026 | 05:19 PM