ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రామ్ చరణ్ సందడి
ABN , Publish Date - Jun 24 , 2026 | 09:42 PM
అమరావతిలో క్రికెట్ సందడి నెలకొంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తుది దశ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. తుది దశ మ్యాచ్‌ల ప్రారంభ వేడుకకు ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ హాజరై ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు.
స్పోర్ట్స్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిలో క్రికెట్ సందడి నెలకొంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) తుది దశ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఇవాళ(బుధవారం)సాయంత్రం భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తుది దశ మ్యాచ్‌ల ప్రారంభ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ.. యువ క్రికెటర్లకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ అనేది అద్భుత అవకాశమన్నారు. యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ లీగ్ ఎంతో సాయపడుతుందని అన్నారు. ఏపీఎల్‌లో పాల్గొంటున్న క్రికెటర్లందరికీ చరణ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శి , ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి స్టేడియంలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం, సాయంత్రం మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 27న లీగ్ దశ ముగుస్తుంది. తర్వాతి రోజు నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో పోటీ పడుతున్న ఏడు జట్లలో ప్రస్తుతం భీమవరం బుల్స్ 6 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో టాప్ 4 జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్ క్రికెట్‌లో విషాదం.. ఐకానిక్ ప్లేయర్ మృతి
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!