Share News

వైభవ్ సూర్యవంశీ తమ్ముడు మరో భారీ సెంచరీ

ABN , Publish Date - Jun 24 , 2026 | 08:31 PM

టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 2.0 వెలుగులోకి వచ్చాడు. అతడి తమ్ముడు మరో భారీ సెంచరీ చేశాడు.

వైభవ్ సూర్యవంశీ తమ్ముడు మరో భారీ సెంచరీ
Aashirvaad Suryavanshi century

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌లో ఉన్నాడు. అతడి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం ఖరారై పోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 2.0 వెలుగులోకి వచ్చాడు. అతడి తమ్ముడు మరో భారీ సెంచరీ చేశాడు. తన తమ్ముడి శతకం గురించి వైభవ్‌ సూర్యవంశీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.


బిహార్‌లోని సమస్తిపూర్‌ స్థానిక ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వైభవ్‌ తమ్ముడు, పదేళ్ల ఆశీర్వాద్‌ సూర్యవంశీ రిషవ్‌ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ మ్యాచ్ లో ఆశీర్వాద్ భారీ శతకం సాధించాడు. వైశాలి ఎలెవన్‌పై 119 బంతుల్లో 19 బౌండరీలు, ఆరు సిక్సర్లు బాది 168 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా దిగిన ఆశీర్వాద్‌ భారీ ఇన్నింగ్స్‌ కారణంగా రిషవ్‌ ఎలెవన్‌ ఘన విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన స్కోరు కార్డును షేర్‌ చేస్తూ సోదరుడి ప్రదర్శన పట్ల వైభవ్‌ ఆనందం వ్యక్తం చేశాడు.Ashirvad.jpg


కాగా ఇటీవలే తేజ్‌పూర్‌ క్రికెట్‌ అకాడమీ తరఫున మ్యాచ్‌ ఆడిన ఆశీర్వాద్‌ .. 87 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. స్వల్ప వ్యవధిలోనే ఇలా మరో సెంచరీ సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా వైభవ్‌కు అన్న ఉజ్వల్‌, తమ్ముడు ఆశీర్వాద్‌ ఉన్నారు. వైభవ్‌ సూర్యవంశీ పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పద్నాలుగేళ్లకే రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. రాయల్స్‌ ఓపెనర్‌గా 2025లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 2026లో సంచలన ప్రదర్శనతో ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌ క్రికెట్‌‌లో విషాదం.. ఐకానిక్ ప్లేయర్ మృతి

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 24 , 2026 | 08:40 PM