Share News

తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jun 24 , 2026 | 08:23 PM

మత్స్య విక్రయాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చేపల విక్రయాల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ SIMMS ద్వారా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం
Telangana Fisheries Federation

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మత్స్య విక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు సమాన అవకాశాలు కల్పించడం, అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా చేపల విక్రయాల కోసం ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఫిషరీస్ ఫెడరేషన్ బుకింగ్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయడంతో ఇకపై బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా సాగనుంది. ముఖ్యంగా స్పాట్ ట్రేడర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడనుంది.


ఈ క్రమంలో SIMMS ద్వారా చేపల బుకింగ్ సేవలను అమలు చేస్తున్నారు. దీని ద్వారా మత్స్యకారులు, వ్యాపారులు సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫెడరేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, 2026 జూన్ నెలలో ఆన్‌లైన్ ద్వారా మొత్తం 25.36 లక్షల చేపల విక్రయాలు నమోదయ్యాయి. వీటిలో సాధారణ బుకింగ్‌ల ద్వారా 14.63 లక్షల చేపలు విక్రయించగా, బుకింగ్ లేకుండా జరిగిన విక్రయాలు 10.73 లక్షలుగా నమోదయ్యాయి.


అలాగే జూన్ 21న ఒక్కరోజే 1.55 లక్షల చేపల ఆన్‌లైన్ విక్రయాలు నమోదవగా, జూన్ 22న 1.56 లక్షల చేపల విక్రయాలతో మరో రికార్డు నమోదైంది. ఈ కొత్త విధానం ద్వారా మత్స్య వ్యాపారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు మత్స్యకారులకు న్యాయమైన అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.


Also Read:

న్యూజిలాండ్‌ క్రికెట్‌‌లో విషాదం.. ఐకానిక్ ప్లేయర్ మృతి

SIR జాబితా నుంచి పేరు తొలగిస్తే రేషన్ ఇవ్వరా?.. సుప్రీంకోర్టు ఆశ్చర్యం

Updated Date - Jun 24 , 2026 | 08:32 PM