SIR జాబితా నుంచి పేరు తొలగిస్తే రేషన్ ఇవ్వరా?.. సుప్రీంకోర్టు ఆశ్చర్యం
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:23 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
న్యూఢిల్లీ, జూన్ 24: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎస్ఐఆర్‌లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా అంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్ర పరిధిలోని ప్రత్యేక కారణాలతో కూడిన అంశం కాబట్టి.. ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా ముందుగా కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. ప్రసన్న తన పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరారు. రేషన్ నిరాకరణ వివాదంపై కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన వెకేషన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
టీమిండియా యువ హిట్టర్ వైభవ్‌పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్