ఇరాన్‌కు రండి.. ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం..
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:39 PM
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు (Ali Khamenei funeral).
జులై 5 నుంచి 9వ తేదీ వరకు ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. మొదట టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం ఖమేనీ స్వస్థలమైన మషాద్‌లో ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నాయకులను, ప్రతినిధి బృందాలను ఇరాన్ ఆహ్వానిస్తోంది (Iran President invitation).
కాగా, ఇరాన్ నుంచి వచ్చిన ఆహ్వానంపై భారత ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు (PM Modi Iran visit). ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతారా లేదా భారత తరఫున ప్రత్యేక ప్రతినిధిని పంపుతారా అనే అంశంపై దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్-ఇరాన్ మధ్య ఇంధనం, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, చాబహార్ నౌకాశ్రయం వంటి కీలక అంశాల్లో సహకారం కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు..