Share News

భువనేశ్వర్ కాదు... అతడి వల్లే గెలిచాం: రజత్ పాటిదార్

ABN , Publish Date - May 11 , 2026 | 10:43 AM

ఐపీఎల్ 2026లో ఆదివారం ముంబైతో జరిగిన ఉత్కంఠభరిమైన మ్యాచ్‍లో చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భువనేశ్వర్ కాదు... అతడి వల్లే గెలిచాం: రజత్ పాటిదార్
Rajat Patidar

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఆదివారం ముంబైతో జరిగిన ఉత్కంఠభరిమైన మ్యాచ్‍లో చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్ చివరి బంతికి ఆర్సీబీ అందుకుంది. ఈ ఉత్కంఠపోరులో విజయం సాధించిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ఈ విజయంలో కృనాల్ పాండ్య పోషించిన పాత్ర ఎంతో కీలకమని, అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు.


'ముంబై బ్యాటర్లను కట్టడి చేయడంలో మా బౌలర్లు సక్సెస్ అయ్యారు. మా బ్యాటింగ్ లైనప్ దానికి తగినంత సమర్థవంతమైనది. ముంబై జట్టు నిర్ధేశించిన లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు. కానీ సునాయాసంగా విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యాము. ఈ మ్యాచ్ గెలవడానికి మేము అర్హులం కాదు. ఇది చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్. జట్టును గెలిపించిన కీలక వ్యక్తి కృనాల్ పాండ్యానే' అని పాటిదార్ అన్నాడు.


'కృనాల్‌ను ఐదో స్థానంలో పంపాలని మా జట్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాము. అతనికి ఓ మంచి అవకాశం ఇవ్వాలని భావించాం, దానికి తగ్గట్టుగానే అతను ఒత్తిడిలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. కృనాల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఎలా ఆదుకుంటారో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ఈ పిచ్‌పై భువీని ఎదుర్కోవడం ఏ బ్యాటర్ కైనా చాలా కష్టం. బంతిపై అతనికి ఉన్న నియంత్రణ నమ్మశక్యం కానిది. ప్రస్తుతం మేము పాయింట్ల పట్టిక గురించి ఆలోచించడం లేదు, పట్టికలో స్థానాల కంటే మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా తొలి ప్రాధాన్యం' అని రజత్ పాటిదార్ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

విరాట్ ఖాతలో మరో అరుదైన చెత్త రికార్డు

ఉర్విల్‌.. ఉరుమల్లే!

Updated Date - May 11 , 2026 | 11:07 AM