Share News

అరంగేట్రంలోనే పాక్ బౌలర్ చెత్త రికార్డ్

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:12 PM

పాకిస్థాన్‌ యువ పేసర్‌ రజావుల్లా టెస్ట్‌ అరంగేట్రంలోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌తో ఈ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అరంగేట్రంలోనే పాక్ బౌలర్ చెత్త రికార్డ్
Razaullah

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌ చేతిలో పాకిస్థాన్ వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జట్టు నుంచి ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను తొలగించి, కొత్తవారికి అవకాశం ఇచ్చింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడవ టెస్ట్‌కు అరంగేట్రం చేసేవారిని జట్టులోకి పిలిచారు. అలాంటి ఆటగాళ్లలో యువ పేసర్ రజావుల్లా ఒకడు. అయితే అరంగేట్రంలోనే రజావుల్లా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.


ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 4 వికెట్లు తీసి, 6.40 ఎకానమీతో ఏకంగా 148 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌ తరఫున టెస్ట్‌ అరంగేట్రంలో అత్యధిక ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జాహిద్ మహ్మద్ తొలిస్థానంలో ఉన్నాడు. అతడు 2022లో ఇంగ్లండ్‌పైనే తన టెస్ట్‌ అరంగేట్రం చేసి, ఆ మ్యాచ్‌లో ఏకంగా 7.3 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా చూసినా టెస్ట్‌ అరంగేట్రంలో ఇదే అత్యంత చెత్త ఎకానమీగా రికార్డుగా ఉంది.


ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో రజావుల్లా పరుగులు ధారాళంగా సమర్పించుకొని, చెత్త రికార్డును మూటగట్టుకున్నా, తన అద్భుత బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఎమిలియో గే, జో రూట్‌, జేమీ స్మిత్‌, రాబిన్సన్‌ లాంటి కీలక బ్యాటర్లను ఔట్‌ చేశాడు. అలాగే క్రమం తప్పకుండా 145 కి.మీ పైగా వేగంతో బంతులు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రజావుల్లా వేగం చూసి అభిమానులు పాకిస్థాన్ దిగ్గజం వకార్ యూనిస్‌ను గుర్తు చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

2027వన్డే ప్రపంచ కప్‌కు కోహ్లీని తిరస్కరించిన పాక్ మాజీ ప్లేయర్

కుల్దీప్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీ చరణి!

Updated Date - Sep 11 , 2026 | 05:48 PM