Share News

2027వన్డే ప్రపంచ కప్‌కు కోహ్లీని తిరస్కరించిన పాక్ మాజీ ప్లేయర్

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:47 PM

2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. టోర్నీపై చర్చ ఇప్పటికే మొదలైంది. మాజీలు, విశ్లేషకులు మెగా టోర్నీపై తమ అంచనాలను, తమతమ ఫేవరెట్‌ జట్లను వెల్లడిస్తున్నారు.

2027వన్డే ప్రపంచ కప్‌కు కోహ్లీని తిరస్కరించిన పాక్ మాజీ ప్లేయర్
Azhar Ali Dream XI

స్పోర్ట్స్ డెస్క్: 2027 వన్డే ప్రపంచ కప్ కు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచి క్రికెట్ అభిమానుల మొదలు మాజీ ప్లేయర్లు, స్టార్ క్రికెటర్లు అందరూ ఈ టోర్నీ గురించే చర్చిస్తున్నారు. క్రికెట్ కు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగిన, ఏ మీడియా సమావేశం జరిగిన ప్రపంచ కప్ టాపిక్ రావాల్సింది. అలానే కొందరు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ మెగా టోర్నీపై తమ అంచనాలను, తమ ఫేవరెట్ జట్లను వెల్లడిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అజర్ అలీ తన డ్రీమ్ ఎలెవెన్ ను ప్రకటించాడు. ఇక్కడే ఓ షాకింగ్ విషయం ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ఓ దేశం నుంచి ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే జట్టులో అవకాశం ఉండాలనే నిబంధనతో అజర్ అలీ తన జట్టును ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్‌ను అలీ ఎంపిక చేశాడు. అయితే మూడో స్థానంలో బ్యాటర్ విషయంలో విరాట్ కోహ్లీని కాదని బాబర్ అజంకు చోటిచ్చాడు. తర్వాతి స్థానాల్లో హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, మిచెల్ శాంట్నర్, ప్యాట్ కమిన్స్, మ్యాట్ హెన్రీ, అబ్రార్ అహ్మద్, జస్ప్రీత్ బుమ్రాను ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్‌ను అవకాశం​ ఇచ్చాడు.


ఇది ఇలా ఉంటే.. మూడో స్థానంలో కోహ్లీని కాదని బాబర్‌కు అవకాశం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏరకంగా చూసినా బాబర్‌ కోహ్లి కంటే బెటర్‌ ఆప్షన్‌ కాదని క్రికెట్ ప్రియులు అంటున్నారు. నిబంధనను సాకుగా చూపి అజర్‌ కోహ్లీపై తన అక్కసు తీర్చుకున్నాడని అంటున్నారు. అజర్‌ గతంలో ఓ సందర్భంలో కోహ్లి కంటే బాబర్‌ మెరుగైన బ్యాటర్‌ అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.


కోహ్లీ, బాబర్.. ఎవరు బెస్ట్ అంటే?

ఏరకంగా చూసినా బాబర్‌ కంటే చాలా రెట్లు మెరుగైన స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ప్రపంచకప్‌ గణాంకాల్లోనూ అతడి కంటే చాలా బెటర్‌గా ఉన్నాడు. కోహ్లీ ప్రపంచకప్‌ టోర్నీల్లో 37 ఇన్నింగ్స్‌ల్లో 59.8 సగటున, 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 1795 పరుగులు చేశాడు. అదే బాబర్ అజం 17 ఇన్నింగ్స్‌ల్లో 52.9 సగటున, సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 794 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఒక్క గణాంకాలు కోహ్లీ రేంజ్‌ ఏంటో నిరూపిస్తాయి.


అజర్ అలీ డ్రీమ్ ఎలెవన్

రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, బాబర్ అజం, హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, అబ్రార్ అహ్మద్, జస్ప్రీత్ బుమ్రా


ఇవి కూడా చదవండి:

కుల్దీప్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీ చరణి!

డీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేశావ్‌గా.. వైభవ్‌ను ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్

Updated Date - Sep 11 , 2026 | 04:48 PM