Share News

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:05 PM

ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...
Mumbai Indians vs Delhi Capitals

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026 సీజ‌న్ ఇవాళ(శ‌నివారం) డ‌బుల్ హెడ‌ర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొద‌టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరికాసేపట్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.


ఢిల్లీతో మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. దీపక్ , బాష్, శాంట్నర్ లను తుది జట్టులోకి తీసుకుంది. ఢిల్లీతో మ్యాచ్ కు హార్దిక్ పాండ్య దూరం కావడంతో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్.. లఖ్‪నవూపై గెలుపొందింది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి.. రెండో విజయాన్ని ఖాతాల్లో వేసుకోవాలని కసితో రెండు జట్లు ఉన్నాయి.


తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్:

కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాథుమ్ నిశాంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేశ్ కుమార్

ఇంపాక్ట్ సబ్స్: అశుతోష్ శర్మ, ఔకిబ్ నబీ దార్, సమీర్ రిజ్వీ, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్

ముంబై ఇండియన్స్:

రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా

ఇంపాక్ట్ సబ్స్: మయాంక్ మార్కండే, రాబిన్ మింజ్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్


ఇవి కూడా చదవండి:

భారత్‌తో స్నేహం కోసం.. బీసీసీఐకి లేఖ రాసిన బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్..

ఆర్సీబీలో ఐదో విదేశీ ప్లేయర్.. విరాట్ కోహ్లీ స్పందన ఏంటంటే..

Updated Date - Apr 04 , 2026 | 04:58 PM