ఆర్సీబీలో ఐదో విదేశీ ప్లేయర్.. విరాట్ కోహ్లీ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:03 PM
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం భారత్‌కు వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు. అయితే కోహ్లీ వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం భారత్‌కు వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు. అయితే కోహ్లీ వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు (Virat Kohli overseas player).
విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడడానికి, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసమే అతడు భారత్‌కు వస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సమయంలో కూడా ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు కోహ్లీ కొన్ని షరతులు పెట్టాడట. మ్యాచ్‌లకు మధ్యలో ఎక్కువ వ్యవధి ఉంటే తనను ప్రత్యేక విమానంలో లండన్‌కు పంపించాలని కోరాడట. అందుకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కూడా ఓకే చెప్పిందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శల గురించి కోహ్లీ స్పందించాడు (Kohli London move).
'ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందని చాలా మంది అంటున్నారు (Kohli reaction viral). వారు అలా ఎందుకు పిలుస్తున్నారు' అనే ప్రశ్నకు కోహ్లీ స్పందిస్తూ.. 'నాకు తెలియదు. ఆ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నావు. నేనేమీ ఓవర్సీస్ ప్లేయర్‌ను కాను. నీకు అలా కనిపిస్తున్నానా. ఈ ప్రశ్న విదేశీ ఆటగాడిని అడుగు' అని చెప్పాడు. అలాగే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు తాను ఎలాంటి షరతులూ పెట్టలేదని తెలిపాడు. ఇక, గత సీజన్‌లో ఆర్సీబీ కప్ గెలిచిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.
ఇవి కూడా చదవండి..
48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..