Share News

హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్..

ABN , Publish Date - Sep 12 , 2026 | 08:58 PM

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రంజీ ట్రోఫీ 2026-27సీజన్‌కు సంబంధించి ఈ నియామకాన్నిహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారికంగా ఖరారు చేసింది.

హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్..
Mohammed Siraj

స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ సారథ్యం వహించనున్నాడు. రంజీ ట్రోఫీ 2026-27సీజన్‌కు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఈ నియామకాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఇదే జట్టుకు మరో పేస్ బౌలర్ చామ మిలింద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు అక్టోబర్ 11 నుంచి త్రిపురతో జరిగే తమ తొలి మ్యాచ్ కోసం ముమ్మరంగా సన్నద్ధమవుతోంది. ఈసారి ఎలైట్ గ్రూప్-బిలో స్థానం దక్కించుకున్న హైదరాబాద్ జట్టు.. త్రిపురతో పాటు సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం జట్లతో తలపడనుంది.


ఇటీవల శ్రీలంక పర్యటనలో సిరాజ్ బౌలింగ్ వేగం సాధారణం కంటే తగ్గిపోవడంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. లంక సిరీస్‌లో తన వేగం 120 కి.మీ వేగ పరిమితికి పడిపోవడంపై తాజాగా సిరాజ్ స్పందించాడు. సుదీర్ఘ విశ్రాంతి తర్వాత నేరుగా మ్యాచ్‌ బరిలోకి దిగడం వల్లే రిథమ్ దెబ్బతిన్నదని తెలిపాడు. తాను పూర్తిగా రిథమ్‌పై ఆధారపడే బౌలర్‌నని స్పష్టం చేశాడు. పరిగెత్తే సమయంలో అడుగులు సరిగ్గా కుదరకపోవడం వల్ల లంక పర్యటనలో ఇబ్బంది పడ్డానని వెల్లడించాడు.


అయితే తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్ ద్వారా తిరిగి తాను ఫామ్ అందుకున్నానని సిరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ తరఫున ఆడిన సిరాజ్.. తాజాగా రంజీ సీజన్‌లో హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దేశవాలీ టోర్నీ ద్వారా సిరాజ్ తన పూర్తి ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్లేయర్లను మార్చినా.. పాకిస్థాన్‌కు తప్పని ఓటమి

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

Updated Date - Sep 12 , 2026 | 09:51 PM