Share News

మానవ్ సుతార్ అరుదైన ఘనత.. 131 ఏళ్ల నాటి రికార్డు సమం

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:04 PM

టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్.. ఇటీవల శ్రీలంక పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 131 ఏళ్ల రికార్డును సమం చేశాడు.

మానవ్ సుతార్ అరుదైన ఘనత.. 131 ఏళ్ల నాటి రికార్డు సమం
Manav Suthar

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్.. ఇటీవల శ్రీలంక పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో హర్భజన్ సింగ్, అశ్విన్‌లను అధిగమించి శ్రీలంకలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో 10 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మానవ్ సుతార్ నిలిచాడు. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 131 ఏళ్ల రికార్డును సమం చేశాడు. మరి.. ఆ రికార్డు వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వార్విక్‌షైర్ జట్టు తరఫున మానవ్ సుతార్ ఆడుతున్నాడు. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో గ్లామోర్గాన్‌ జట్టుతో జరిగిన డివిజన్-1 మ్యాచ్‌లో 26 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టాడు. సుతార్ సాధించిన అద్భుతమైన గణాంకాలు 131 ఏళ్ల రికార్డును సమం చేసింది. చివరిసారిగా 1895లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇలాంటి ఘనత నమోదైంది.


ఇంగ్లండ్ క్రికెటర్ టామ్ హేవర్డ్ 1895లో లీసెస్టర్‌షైర్ తరఫున సర్రే జట్టుపై ఆరు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. తాజాగా హేవర్డ్ సరసన మానవ సుతార్ నిలిచాడు. ఒక మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా, రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం ఒక వికెట్ తీసిన రెండవ ఆటగాడిగా సుతార్ అరుదైన ఘనత సాధించాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. అనంతరం గ్లామోర్గాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వార్విక్‌షైర్ ఇన్నింగ్స్, 257 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

అరంగేట్రంలోనే పాక్ బౌలర్ చెత్త రికార్డ్

2027వన్డే ప్రపంచ కప్‌కు కోహ్లీని తిరస్కరించిన పాక్ మాజీ ప్లేయర్

Updated Date - Sep 11 , 2026 | 06:10 PM