Share News

కోహ్లీ ఆటోగ్రాఫ్‌ దక్కలేదని ఏడ్చిన బాలుడు.. లలిత్ మోదీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

ABN , Publish Date - Jun 04 , 2026 | 02:28 PM

ఐపీఎల్ 2026 సమయంలో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఓ పిల్లాడు బాధపడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ కూడా ఓ బహుమతి పంపించారు.

కోహ్లీ ఆటోగ్రాఫ్‌ దక్కలేదని ఏడ్చిన బాలుడు.. లలిత్ మోదీ సర్‌ప్రైజ్ గిఫ్ట్
Virat Kohli Fan

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని యుగ్‌వీర్‌ బుధిరాజా అనే పిల్లాడు బాధపడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం హోటల్‌లోకి వెళ్తున్న విరాట్ వద్దకు సదరు బాలుడు వచ్చి.. ఆటోగ్రాప్ తీసుకునేందుకు ప్రయత్నించగా వీలుపడలేదు. దీంతో ఆ బాలుడు బ్యాట్ విసిరేస్తూ కన్నీరుపెట్టుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడం ఆ తర్వాత బాలుడికి నెట్టింట మద్దతు లభించింది. తాజాగా బుధిరాజా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ ఓ బహుమతి పంపించారు.


దీనికి సంబంధించిన యుగ్‌వీర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘థాంక్యూ.. లలిత్‌ మోదీ సర్. మీరు చేసిన వీడియో కాల్‌తోనే నా రోజు ప్రారంభమైంది. మీరు బహుమతి పంపిచిన క్షణం ఎప్పటికీ మరిచిపోలేనిది. నన్ను గుర్తించి మీరు బహుమతి పంపినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ నుంచి బ్యాట్‌ను అందుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని యుగ్‌వీర్ తెలిపాడు.


యుగ్‌వీర్ పోస్ట్‌ను లలిత్ మోదీ రీపోస్ట్ చేస్తూ స్పందించాడు. ‘నా దగ్గర తొలి సీజన్‌లో అందరూ తమ ఆటోగ్రాఫ్‌ చేసిన బ్యాట్ ఉంది. అందులో విరాట్ సైన్ కూడా ఉంది. దానిని నేను యుగ్‌వీర్‌కు పంపించా. విరాట్‌ కోహ్లీ ఒక్కడే సంతకం చేసిన బ్యాట్‌ లేదు. త్వరలోనే కోహ్లీ ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌ను కూడా ఆ బాలుడికి వ్యక్తిగతంగా అందించేందుకు ఒకరిని పురమాయించా’ అని లలిత్ మోదీ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 04 , 2026 | 02:34 PM