బంగ్లాదేశ్ గడ్డపై జోమెల్ వారికన్ చరిత్ర.. 5 వికెట్లతో అరుదైన రికార్డు
ABN , Publish Date - Oct 29 , 2026 | 03:53 PM
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ ఫైఫర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతడి ధాటికి బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకే కుప్పకూలింది.
స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ ఫైఫర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతడి ధాటికి బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకే కుప్పకూలింది. ఈ ప్రదర్శనతో వారికన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
బంగ్లాదేశ్ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన విండీస్ స్పిన్నర్‌గా వారికన్(5-53)నిలిచాడు. గతంలో ఈ రికార్డు రకీమ్ కార్న్‌వాల్ (5-74) పేరిట ఉండేది. వారికన్, కార్న్‌వాల్ కాకుండా దేవేంద్ర బిషూ (5-90) మాత్రమే బంగ్లాదేశ్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కరేబియన్ స్పిన్నర్‌గా వారికన్ నిలిచాడు. అతడికి 26 టెస్ట్‌ల్లో ఇది నాలుగో ఫైపర్ ప్రదర్శన.
ఇక మ్యాచ్‌లో వారికన్‌తో పాటు బిషప్ (2-61), షమార్ జోసఫ్ (2-41), జేడన్ సీల్స్ (1-29) సత్తా చాటారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (105) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తౌహిద్ హృదోయ్ (42), లిటన్ దాస్ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లలో తంజిద్ హసన్ 7, మొమినుల్ హక్ 28, నజ్ముల్ హసన్ షాంటో 19, మెహిది హసన్ మిరాజ్ 15, నయీమ్ హసన్ 5, హసన్ మహముద్ 6, తైజుల్ ఇస్లాం 1 పరుగుకే ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు వెలుతురు లేమి సమస్య కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (15) ఔట్ కాగా.. జాన్ క్యాంప్‌బెల్ (53), తేజ్‌నరైన్ చంద్రపాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..