Share News

'ది హండ్రెడ్' టోర్నీ నుంచి జెమీమా ఔట్!

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:45 PM

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. గాయం కారణంగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' 2026 నుంచి ఆమె వైదొలిగింది.

 'ది హండ్రెడ్' టోర్నీ నుంచి జెమీమా ఔట్!
Jemimah Rodrigues

స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. గాయం కారణంగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' 2026 మహిళల టోర్నమెంట్ నుంచి ఆమె వైదొలిగింది. ఈ లీగ్‌లో 'సదరన్ బ్రేవ్' జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా, మ్యాచ్ ఆడుతున్న సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైంది.


ఈ టోర్నీలో సదరన్ బ్రేవ్ తరఫున అత్యంత కీలక ప్లేయర్‌గా మారిన జెమీమా, 6 ఇన్నింగ్స్‌లలో 143 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఆమె దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్‌ల కోసం జెమీమా స్థానంలో ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను సదరన్ బ్రేవ్ మేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది.


ఆసియా కప్‌లో ఆడటంపై అనుమానాలు:

కాలి కండరాల గాయం తీవ్రత దృష్ట్యా, త్వరలో జరగబోయే మహిళల ఆసియా కప్‌లో జెమీమా భాగస్వామ్యంపై అనిశ్చితి నెలకొంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఆసియా కప్ టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడాల్సి ఉంది.


ఆసియా కప్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలంటే జెమీమాకు దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో ఆమె కోలుకుని జట్టులోకి పునరాగమనం చేస్తుందో లేదో వేచి చూడాలి. జెమీమా త్వరగా కోలుకోవాలని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు

Updated Date - Aug 08 , 2026 | 05:47 PM