టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:10 PM
శ్రీలంకతో త్వరలో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో త్వరలో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల కాలంలో వన్ డౌన్‌లో నిలకడగా రాణిస్తున్న సుదర్శన్‌ను ప్రారంభంలో ఫిట్‌నెస్‌కు లోబడి జట్టులోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో పునరావాసం పొందుతున్న అతను, మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ సాధించలేదని వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఈ పర్యటనకు అతడు దూరం కాక తప్పలేదు. ఆగస్టు 4న భారత జట్టు శ్రీలంకకు వెళ్లినప్పుడు సుదర్శన్ ఆ బృందంతో ప్రయాణించలేదు.
ఆగస్టు 15న గాల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా, సుదర్శన్ స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది. కొలంబోలో శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పడిక్కల్ అద్భుత శతకంతో మెరిసి జట్టు యాజమాన్యం దృష్టిని ఆకర్షించాడు. బీసీసీఐ సెలెక్టర్లు త్వరలోనే సుదర్శన్ స్థానంలో తుది ఆటగాడి పేరును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఇప్పటి వరకు సుదర్శన్ భారత్ తరఫున 7 టెస్టులు ఆడి, మూడు అర్ధశతకాల సాయంతో 383 పరుగులు చేశాడు. చివరగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అతడి గైర్హాజరీలో పడిక్కల్ మూడో స్థానంలో తన ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశం దక్కిందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు
10 ఏళ్ల నిరీక్షణ.. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండో పతకం